News September 11, 2024
వినికిడి సమస్య వేధిస్తోందా.. కొవిడ్ వల్లేనేమో!
కొవిడ్ సైడ్ ఎఫెక్టుల్లో వినికిడి సమస్య ఒకటని ఇ-క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన ఓ స్టడీ తెలిపింది. కరోనా సోకిన యువతలో చెవుడు వచ్చే ప్రమాదం 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది. పేషంట్లు ఇలాంటి సమస్యలతో వస్తే ఈ కోణంపై దృష్టిసారించాలని సూచించింది. 20-39 మధ్య వయస్సున్న 60 లక్షల మంది డేటా ఆధారంగా దీనిని తెలుసుకున్నామని సౌత్ కొరియా చుంగ్ అంగ్ వర్సిటీ ఫ్యామిలీ మెడిసిన్ ప్రొఫెసర్ యున్ హాన్ తెలిపారు.
Similar News
News October 7, 2024
వచ్చే ఏడాది మూడు చోట్ల బీచ్ ఫెస్టివల్: మంత్రి దుర్గేశ్
AP: రుషికొండ నిర్మాణాలను ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా రుషికొండలో మ్యూజియం ఏర్పాటు చేయాలేమోనని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.
News October 7, 2024
రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్ రావు
TG: రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మాఫీ అమలు విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్బీఐ డేటా ప్రకారం చాలా మందికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ఆపి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.