News February 13, 2025
ఎల్లుండి సెలవా?

TG: ఈనెల 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆరోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇక సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ CM రేవంత్‌ను మంత్రి సీతక్క, గిరిజన నాయకులు నిన్న కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సెలవుపై CM ఏం నిర్ణయం తీసుకుంటారో.
Similar News
News March 20, 2025
వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.
News March 20, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News March 20, 2025
రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.