News August 4, 2024

రోహిత్ ఔటైతే ఓటమేనా?

image

శ్రీలంకపై భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పోరాడుతున్నా మిగతా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. తొలి వన్డేలో 75/0తో పటిష్ఠ స్థితిలో నిలిచిన టీమ్ ఇండియా 230కి ఆలౌటైంది. రెండో వన్డేలో 97/0 నుంచి 208కే చాప చుట్టేసింది. రోహిత్ ఔట్ అవ్వగానే పిచ్ మారిపోతుందా? అని నెటిజన్లు భారత బ్యాటర్లపై మండిపడుతున్నారు. మరి భారత్ ఓటమికి గల కారణాలపై మీ కామెంట్?

Similar News

News September 15, 2024

గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైళ్ల సమయం పెంపు

image

TG: ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సేవలను అధికారులు పొడిగించారు. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైలు బయల్దేరుతుందన్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి నిమజ్జనం ముగిసే వరకు అదనపు రైళ్లు నడిపిస్తామని అధికారులు తెలిపారు.

News September 15, 2024

సవాలుగా మారిన బోట్ల తొలగింపు

image

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశే ఎదురైంది. కట్ చేసిన బోట్లు బయటకు వచ్చినట్లే వచ్చి నీట మునిగాయి. దీంతో పడవలను బయటకు తీసేందుకు మరో ప్లాన్‌ను అబ్బులు టీమ్ రెడీ చేస్తోంది. ప్రస్తుతానికి పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు నీట మునిగిన పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగించనున్నారు.

News September 15, 2024

రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం కీలక ప్రకటన

image

TG: రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తాడిచెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని విమర్శించారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.