News June 4, 2024
ఈటలకు ఈజీనేనా?
TG: సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజిగిరిలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. బలమైన నేత ఈటల రాజేందర్‌ను బరిలో దింపడం, ప్రధాని మోదీ అక్కడ రోడ్‌షో నిర్వహించడంతో గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? సునీతా మహేందర్‌రెడ్డికి జనం జై కొడతారా?లేక బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డివైపు జనం చూస్తారా? అనేది ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 8, 2024
రెండో రోజు వినాయకుడిని ఎలా పూజించాలంటే..?
వినాయక నవరాత్రుల్లో రెండో రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు గణపతిని ‘వికట వినాయకుడు’ అంటారు. ‘లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామికి ఆవాహన పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. రెండో రోజు పూజ లక్ష్యం సమాజం దుష్ట కామాన్ని వీడటం.
News September 8, 2024
ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..
కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
✒ శ్రీశైలం: ఇన్‌ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.09లక్షలు
✒ సాగర్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.99లక్షలు
✒ పులిచింతల: ఇన్‌ఫ్లో 2.75లక్షలు, ఔట్‌ఫ్లో 2.97లక్షలు
✒ ప్రకాశం బ్యారేజ్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88లక్షల క్యూసెక్కులు
News September 8, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.