News January 9, 2025
ఉచితాలా? సౌకర్యాలా? ఏవి కావాలో తేల్చుకోండి: అరవింద్

ఉచిత పథకాలపై 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో? మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికే ఖర్చుచేయాలి. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
CBSE కొత్త కరిక్యులం.. 3 భాషలు చదవాల్సిందే

వచ్చే అకడమిక్ ఇయర్(2026-27) నుంచి అమలు చేసే పాఠ్య ప్రణాళికను CBSE రిలీజ్ చేసింది. ఆరో తరగతి నుంచి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా(3 భాషలు చదవడం)ను తప్పనిసరి చేసింది. ఇందులో 2 భారతీయ భాషలు ఉండాలి. ఇంగ్లిష్‌ను ఫారిన్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తారు. అలాగే మాథ్స్, సైన్స్‌లో టూ లెవెల్ సిస్టమ్ రానుంది. ఇందులో భాగంగా 80మార్కుల కామన్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. మరో 25Mకు అడ్వాన్స్‌డ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆప్షనల్.
News April 3, 2026
LokPoll సర్వే.. కేరళంలో కాంగ్రెస్‌దే అధికారం!

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDFదే అధికారమని <<19539543>>LokPoll<<>> సర్వే అంచనా వేసింది. ఆ కూటమికి 42-44% ఓట్లు, 77-81 సీట్లు వస్తాయని తెలిపింది. సీఎం విజయన్ సారథ్యంలోని LDFకు 39-41% ఓట్లు, 58-62 సీట్లు రావొచ్చని వెల్లడించింది. NDA 14-16% ఓట్లు, 1-2 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవ్వొచ్చని పేర్కొంది. కేరళంలో 140 స్థానాలకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.
<<-se>>#ELECTIONS2026<<>>
News April 3, 2026
భూ భారతి: రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ నో ఛేంజ్

TG: ‘భూ భారతి’లో GOVT కొత్త రూల్ పెడుతోంది. భూ యజమాని ముందు ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేస్తే సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులిస్తారు. వారి సమక్షంలో సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు ఇస్తారు. రెవెన్యూశాఖ ఇచ్చే సర్వేపటంతో భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాలి. సర్వేలో తేలిన విస్తీర్ణానికే రిజిస్ట్రేషన్ చేస్తారు. తరువాత మార్పునకు అవకాశం ఉండదు.


