News November 13, 2024
దాడులు చేయడం మంచిదేనా KTR?: కోమటిరెడ్డి
TG: కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా KTR అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని BRS నేతలు చెప్పడం దారుణమన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌తో మాజీ MLA ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. ఎఫ్-1రేసులో RBI అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారని, ఈ కేసులో KTR తప్పించుకోలేరని తెలిపారు.
Similar News
News December 10, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
News December 10, 2024
ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో మంటలు?
సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్‌పూల్, సిబ్బంది గదులతోపాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఫిల్మ్ నగర్‌లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్‌పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆరోపణ.
News December 10, 2024
రాహుల్ గాంధీ ఇది ఎలాంటి వంచన?: కేటీఆర్
TG: అదానీ-మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్టయినప్పుడు, అదానీ-రేవంత్ ఫొటోలతో టీషర్టులు వేసుకున్న తమను అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదని కేటీఆర్ X వేదికగా ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ గారు ఇది ఎలాంటి వంచన? మీ అడుగుజాడల్లో నడిచి అదానీ-రేవంత్ అఫైర్‌ను బయటపెడదామనుకున్నాం. కానీ మమ్మల్ని రానివ్వలేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.