News April 25, 2024

అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పా?: బాబు

image

AP: అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం పెద్ద గొప్పా? అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసమర్థ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ఇబ్బందులే. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్. ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News February 9, 2026

మంచిర్యాల: తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు

image

తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని IRCTC-టూరిజం సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో టూర్ ప్యాకేజీ కరపత్రాలను ఆవిష్కరించారు. మార్చి 21, ఏప్రిల్ 14 తేదీలలో 2 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.itctctourism.comలో సంప్రదించాలన్నారు.

News February 9, 2026

టాలెంట్‌కు పరీక్షలు కొలమానం కాదు: శ్రీధర్ వెంబు

image

టాలెంట్‌ను కొలవడంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ప్రమాణాలు కాదని ZOHO కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి అసాధారణ ప్రతిభను వీటి ద్వారా గుర్తించలేరని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ డ్యుమినిల్ ఎప్పుడూ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనలేదని, అయినా సత్తా ఏంటో చూపారని Meta AI మాజీ శాస్త్రవేత్త యాన్ లెకన్ ట్వీట్ చేశారు. యాన్ కామెంట్స్‌కు మద్దతుగా వెంబు ఈ విధంగా స్పందించారు.

News February 9, 2026

ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

image

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.