News November 20, 2024

దేశ రాజధానిని మార్చడం సాధ్యమేనా?

image

కాలుష్య మయమైన ఢిల్లీని రాజధానిగా కొనసాగించడం అవసరమా అని కాంగ్రెస్ MP శశిథరూర్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో 8 దేశాలు తమ రాజధానులను మార్చాయి. నైజీరియా(లాగోస్-అబుజా), మయన్మార్(రంగూన్-నైపిడావ్), రష్యా(సెయింట్ పీటర్స్‌బర్గ్-మాస్కో), పాకిస్థాన్(కరాచీ-ఇస్లామాబాద్), బ్రెజిల్(రియో డి జనీరో-బ్రెసిలియా), కజకిస్థాన్, టాంజానియా, ఐవరీ కోస్ట్ సైతం తమ రాజధాని నగరాలను మార్చాయి.

Similar News

News December 9, 2024

నాపై దాడి చేశారు.. ప్రాణహాని ఉంది: మంచు మనోజ్

image

TG: పహాడీ షరీఫ్ పీఎస్‌కు వచ్చిన హీరో మంచు మనోజ్ నిన్న జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.

News December 9, 2024

తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR

image

TG: కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది. మొన్న ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమైపోయాయి. తెలంగాణ తల్లి అని చెప్పి సీఎం బిల్డప్ ఇస్తున్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ మాయమైంది. విగ్రహ రూపంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.

News December 9, 2024

విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

image

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.