News March 5, 2025

సంప్రదాయమేనా? సర్‌ప్రైజ్ ఉంటుందా?

image

TG: కాంగ్రెస్‌లో MLA కోటా MLC పదవులకు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ MLC జీవన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. One Leader One Post నిర్ణయంతో నరేందర్‌ను, ఇప్పటికే చాలా ఛాన్సులు పొందారని జీవన్‌ను రెడ్డి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియార్టీ సంప్రదాయాన్ని కాదని OLOPతో పాటు యువరక్తంపై మొగ్గు చూపితే సామ రామ్మోహన్ రెడ్డి వంటి వారికీ సర్‌ప్రైజ్ ఛాన్స్ రావచ్చు.

Similar News

News January 20, 2026

ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నవీన్ పొలిశెట్టి

image

‘అనగనగా ఒక రాజు’ మూవీ <<18896518>>రూ.100 కోట్ల<<>> మార్క్ అందుకోవడంపై హీరో నవీన్ పొలిశెట్టి భావోద్వేగ ట్వీట్ చేశారు. ముంబైలో పాల్గొన్న ఎన్నో ఆడిషన్స్, సినిమాని వదిలేయాలనుకున్న క్షణాలు గుర్తొచ్చాయని తెలిపారు. <<13646691>>యాక్సిడెంట్<<>> తర్వాత నటించగలనా అని ప్రతిరోజూ ఏడ్చే వాడినని వెల్లడించారు. ఈ సక్సెస్ ఎన్నో ఏళ్ల తన పోరాటానికి ఫలితమన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం మన అందరిదని పేర్కొన్నారు.

News January 20, 2026

విమాన ఛార్జీల పెంపు.. కేంద్రం, DGCAకి సుప్రీంకోర్టు నోటీసులు

image

పండుగల సమయంలో విమాన ఛార్జీలను పెంచుతూ ఎయిర్‌లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఛార్జీల పెంపును నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. ‘మేము కచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటాం’ అని స్పష్టం చేసింది. దీనిపై రిప్లైలు కోరుతూ కేంద్రం, DGCAకి నోటీసులిచ్చింది.

News January 20, 2026

గుజరాత్‌పై RCB ఘన విజయం

image

WPLలో RCB హవా కొనసాగుతోంది. గుజరాత్‌పై 61 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో GG జట్టు తడబడింది. కెప్టెన్ గార్డ్‌నర్(54) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. RCB బౌలర్లలో సయాలి 3, నాడిన్ డి క్లెర్క్ 2, లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక తలో వికెట్ తీశారు. RCB వరుసగా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.