News November 14, 2024
ప్రజలకు మంచి చేయడమే తప్పా?: భట్టి
TG: తమ ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో KTR చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. ‘నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే తప్పా? ప్రజలకు మంచి చేయడమే తప్పా? కులగణన, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా? అధికారం కోసం బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోంది. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. మా ప్రభుత్వాన్ని కూల్చడంపైనే BRS దృష్టి పెట్టింది’ అని భట్టి ఆరోపించారు.
Similar News
News December 7, 2024
మ్యూజిక్ నుంచి రెహమాన్ బ్రేక్? కూతురు ఏమన్నారంటే?
ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్‌ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.
News December 7, 2024
అల్పపీడనం.. రేపు వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
News December 7, 2024
రైతులు సన్నాలనే పండించాలి.. సీఎం పిలుపు
TG: తెలంగాణ రైతులు సన్న వడ్లనే పండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సన్నవడ్లు పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు, మధ్యాహ్నభోజనంలో పేద పిల్లలకు రైతులు పండించిన సన్నబియ్యాన్నే పెడతామని పేర్కొన్నారు. ఎవరు అడ్డువచ్చినా సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.