News August 6, 2024
బంగ్లా సంక్షోభం వెనుక జమాతే ఇస్లామీ?

జమాతే ఇస్లామీ పాక్-బంగ్లాలో ప్రాబల్యం కలిగిన ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 1941లో మౌలానా మౌదూది దీన్ని స్థాపించారు. బంగ్లాలో దీని విద్యార్థి విభాగం ఛాత్ర శిబిర్కు ఐఎస్ఐ అండ ఉందని, విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారడం వెనుక ఇదే కీలకంగా తెలుస్తోంది. బంగ్లా అల్లర్ల వెనుక ఈ పార్టీ హస్తం ఉందని షేక్ హసీనా ఆగస్టు 1న జమాతే ఇస్లామీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించారు.
Similar News
News October 18, 2025
భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
News October 18, 2025
ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.