News August 6, 2024

బంగ్లా సంక్షోభం వెనుక‌ జ‌మాతే ఇస్లామీ?

image

జ‌మాతే ఇస్లామీ పాక్-బంగ్లాలో ప్రాబల్యం కలిగిన ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 1941లో మౌలానా మౌదూది దీన్ని స్థాపించారు. బంగ్లాలో దీని విద్యార్థి విభాగం ఛాత్ర శిబిర్‌కు ఐఎస్ఐ అండ ఉందని, విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారడం వెనుక ఇదే కీలకంగా తెలుస్తోంది. బంగ్లా అల్ల‌ర్ల‌ వెనుక ఈ పార్టీ హ‌స్తం ఉంద‌ని షేక్ హ‌సీనా ఆగస్టు 1న జమాతే ఇస్లామీని ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించి నిషేధించారు.

Similar News

News September 8, 2024

ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..

image

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
✒ శ్రీశైలం: ఇన్‌ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.09లక్షలు
✒ సాగర్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.99లక్షలు
✒ పులిచింతల: ఇన్‌ఫ్లో 2.75లక్షలు, ఔట్‌ఫ్లో 2.97లక్షలు
✒ ప్రకాశం బ్యారేజ్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88లక్షల క్యూసెక్కులు

News September 8, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.