News November 19, 2024

కొడంగల్ ఏమైనా పాక్ సరిహద్దుల్లో ఉందా?: కేటీఆర్

image

లగచర్ల ఘటనలో వాస్తవాలను తొక్కిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో ఆరోపించారు. ‘లగచర్లకు పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ కిరాతకం ఢిల్లీకి చేరింది. మీ అరాచకపర్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. లగచర్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News December 9, 2024

నాపై దాడి చేశారు.. ప్రాణహాని ఉంది: మంచు మనోజ్

image

TG: పహాడీ షరీఫ్ పీఎస్‌కు వచ్చిన హీరో మంచు మనోజ్ నిన్న జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.

News December 9, 2024

తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR

image

TG: కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది. మొన్న ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమైపోయాయి. తెలంగాణ తల్లి అని చెప్పి సీఎం బిల్డప్ ఇస్తున్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ మాయమైంది. విగ్రహ రూపంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.

News December 9, 2024

విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

image

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.