News May 4, 2024

గాడిదతో రేవంత్ గుడ్లు పెట్టిస్తున్నారా?: కిషన్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ‘గాడిద గుడ్డు’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని రేవంత్ అసత్యాలు చెబుతున్నారు. ఆయన గాడిదతో గుడ్లు పెట్టిస్తున్నారా? ఫర్టిలైజర్ పరిశ్రమ, RRR, NTPC ప్రాజెక్టులు గాడిద గుడ్లా?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన తమకు లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News November 15, 2025

3 – 20వ వారం వరకు గొర్రె పిల్లలకు ఆహారం

image

☛ 3- 7 వారాల వరకు తల్లిపాలతో పాటుగా అధిక పోషక విలువలు కలిగి సులువుగా జీర్ణమయ్యే క్రీపు దాణాను.. పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి. ఇలా చేస్తే 7 వారాలకు పిల్లలు కనీసం 12kgల బరువు పెరుగుతాయి.
☛ 8 నుంచి 20వ వారం వరకు పిల్లలకు మేతను T.M.R (టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌) రూపంలో అందించాలి. టి.ఎం.ఆర్‌‌తో పాటుగా గొర్రెలకు పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.

News November 15, 2025

బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

image

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూడిల్స్‌, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

News November 15, 2025

పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.