News May 4, 2024
గాడిదతో రేవంత్ గుడ్లు పెట్టిస్తున్నారా?: కిషన్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ‘గాడిద గుడ్డు’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని రేవంత్ అసత్యాలు చెబుతున్నారు. ఆయన గాడిదతో గుడ్లు పెట్టిస్తున్నారా? ఫర్టిలైజర్ పరిశ్రమ, RRR, NTPC ప్రాజెక్టులు గాడిద గుడ్లా?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన తమకు లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
Similar News
News December 6, 2025
చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News December 6, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధి.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. ఇది సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములు చేరిన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఫారమ్‌లోని కోళ్లన్నీ మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ సూచనలకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 6, 2025
BECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్: https://www.becil.com


