News November 3, 2024

రిషభ్ పంత్‌ది ఔటా? నాటౌటా?

image

NZతో మూడో టెస్టులో IND బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. కివీస్ DRS తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్‌ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ కూడా బాల్ బ్యాట్‌ను తాకలేదని అంపైర్లతో వాదించారు. ఔటివ్వడంతో క్రీజును వదల్లేక తప్పలేదు.

Similar News

News November 18, 2025

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

image

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.