News November 3, 2024
రిషభ్ పంత్‌ది ఔటా? నాటౌటా?
NZతో మూడో టెస్టులో IND బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. కివీస్ DRS తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్‌ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ కూడా బాల్ బ్యాట్‌ను తాకలేదని అంపైర్లతో వాదించారు. ఔటివ్వడంతో క్రీజును వదల్లేక తప్పలేదు.
Similar News
News December 5, 2024
IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
News December 5, 2024
నేడు ప్రోబా-3 ప్రయోగం
AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.
News December 5, 2024
EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు
AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.