News April 25, 2024

లోక్‌సభ ఎన్నికల బరిలో సిద్ధూ మూసేవాలా తండ్రి?

image

రెండేళ్ల క్రితం హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్‌కౌర్ సింగ్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని బఠిండా నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారట. దీనిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. బల్‌కౌర్ సింగ్ దంపతులు ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ బేబీ విషయంలో ప్రభుత్వం తమను వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.

Similar News

News March 5, 2026

‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

image

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.

News March 5, 2026

జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

image

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.

News March 5, 2026

హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

image

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.