News June 18, 2024

సిగ్నల్ పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమా?

image

నిన్న బెంగాల్‌ రైలు ప్రమాద సమయంలో ఆటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయలేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాణిపత్ర-ఛత్తర్ హట్ స్టేషన్ల మధ్య సిగ్నల్ పడలేదని అధికారులు భావిస్తున్నారు. అటు రెండు రైళ్లు ఒకే లైన్‌‌పైకి వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా బ్రేక్ పడే వ్యవస్థ ‘కవచ్’ కూడా ఆ మార్గంలో అందుబాటులో లేదు. ఉంటే ప్రమాదం తప్పేదని అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.

News March 5, 2026

బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

image

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్‌కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.