News February 1, 2025

SSM29 గురించి జక్కన్న చెప్పేది అప్పుడేనా?

image

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కే SSMB29 షూటింగ్ విజయవాడ సమీపంలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నిబంధనల విషయంలో దర్శకుడు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న జక్కన్న, తర్వాతి షెడ్యూల్‌ కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అది పూర్తయ్యాక మూవీ టీమ్ గురించి వీడియోలో లేదా ఈవెంట్‌లో వివరించనున్నట్లు సమాచారం.

Similar News

News February 18, 2025

అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

image

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తోనే అని బన్నీఒక ప్రైవేట్‌ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.

News February 18, 2025

ఇన్ఫీ మా ట్రేడ్ సీక్రెట్లను దొంగిలించింది: కాగ్నిజెంట్

image

తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ TriZetto ట్రేడ్ సీక్రెట్లను దొంగిలిస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు కాగ్నిజెంట్ US కోర్టు ఫైలింగులో పేర్కొంది. తమ కంపెనీ, తమ CEO రవికుమార్ పోటీ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ Infosys Helix గ్రోత్‌ను తగ్గించేలా సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఇన్ఫీ కౌంటరుకు ఇలా స్పందించింది. ఈ 2 కంపెనీల మధ్య చాన్నాళ్లుగా పోచింగ్ కేస్ నడుస్తోంది.

News February 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.79,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరగడంతో రూ.86,950లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

error: Content is protected !!