News December 19, 2024
అందుకే అశ్విన్ రిటైర్మెంట్?: అశ్విన్ తండ్రి
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆయన తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. దీనికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నా. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో ఆశ్చర్యం వేసింది. అప్పటివరకు నాకు కూడా ఈ విషయం తెలియదు. వీడ్కోలు పలికినందుకు సగం సంతోషం, సగం బాధగా ఉంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 18, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?
TG: రాష్ట్రంలోని స్కూళ్లకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ కూడా హాలిడే అంటూ కొన్ని స్కూళ్లు తల్లిదండ్రులకు మెసేజులు పంపించాయి. అటు హాస్టళ్లలో ఉండే చాలా మంది విద్యార్థులు ఇంకా స్వస్థలాల నుంచి రాలేదు. సోమవారం నుంచి వస్తామని చెబుతున్నారు. మరి ఇవాళ మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
News January 18, 2025
బుల్లి రాజు మరో మాస్టర్ భరత్ అవుతాడా?
సినిమాల్లో మాస్టర్ భరత్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాల్లో భరత్ చేసిన కామెడీ సూపర్. ఇప్పటికీ ఆ సీన్లు మీమ్స్ రూపంలో SMలో దర్శనమిస్తాయి. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుడ్డోడు బుల్లిరాజు(రేవంత్) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. చిన్నోడి కామెడీకి అభిమానులు ఫిదా అయ్యారు. రాబోయే రోజుల్లో భరత్ స్థానాన్ని ఈ చిన్నోడు భర్తీ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News January 18, 2025
ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!
AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకోసం పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ నిన్న మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,800 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే మార్చిలో శంకుస్థాపన చేయనున్నారు. తమ ఫ్యాక్టరీ నుంచి తొలి ఈవీ బైక్ 2026 డిసెంబర్ నాటికి విడుదలవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.