News December 1, 2024
బ్రిక్స్ కరెన్సీకి ఇక కాలం చెల్లినట్టేనా..?

డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేలా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని తీసుకొస్తే ఆయా దేశాలపై 100% టారిఫ్‌లు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరిక సంచలనమైంది. అందుకే ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. కొత్త కరెన్సీతో అనవసర సంఘర్షణలకు ఆస్కారం ఇవ్వకూడదని భావిస్తోంది. వాణిజ్యానికి బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీనే ఉపయోగిస్తాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.
Similar News
News February 8, 2025
కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్

ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.
News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
News February 8, 2025
ఖట్టర్ ఇమాందార్.. ఇమేజ్ ఖతం!

లూజు ప్యాంటు. పొడవు చొక్కా. జేబులో రెనాల్డ్స్ పెన్ను. తలకు మఫ్లర్. పర్ఫెక్టుగా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు ఖట్టర్ ఇమాందార్‌గా ఉంటానని ప్రతిజ్ఞ. అవినీతి రహిత రాజకీయాలు చేస్తానన్న హామీతో వరుసగా 3సార్లు గెలుపు. కట్‌చేస్తే శీశ్‌మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోడ్. వేగనార్ పోయి బెంజ్ వచ్చే. లిక్కర్, వాటర్ స్కాములు. అవినీతి ఆరోపణలు. జైల్లోనూ పదవిపై వ్యామోహం. కళంకిత ఇమేజ్‌తో AKకు శరాఘాతం!