News March 11, 2025
వ్యాపారులకు కేంద్రం షాక్?

UPI, రూపే డెబిట్ కార్డు లావాదేవీల విషయంలో వ్యాపారులకు షాక్ తగిలే అవకాశం ఉంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను(MDR) మళ్లీ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. GST వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు మించిన వారికి మాత్రమే ఇది వర్తించనుంది. 2022 ముందు వ్యాపారులు ఒక శాతానికంటే తక్కువగా MDR కట్టేవారు. ఆ తర్వాత బ్యాంకులు ఈ ఛార్జీలను తొలగించాయి.
Similar News
News November 17, 2025
షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.
News November 17, 2025
జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ధరూర్ క్యాంప్లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 17, 2025
మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్పై SC ఆగ్రహం

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.


