News March 11, 2025

వ్యాపారులకు కేంద్రం షాక్?

image

UPI, రూపే డెబిట్ కార్డు లావాదేవీల విషయంలో వ్యాపారులకు షాక్ తగిలే అవకాశం ఉంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను(MDR) మళ్లీ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. GST వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు మించిన వారికి మాత్రమే ఇది వర్తించనుంది. 2022 ముందు వ్యాపారులు ఒక శాతానికంటే తక్కువగా MDR కట్టేవారు. ఆ తర్వాత బ్యాంకులు ఈ ఛార్జీలను తొలగించాయి.

Similar News

News March 27, 2025

షాకింగ్: అరణ్యంలో చిన్నారి మావోయిస్టులు!

image

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో బాల మావోయిస్టులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సారయ్య వద్ద లభ్యమైన లేఖలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. గెరిల్లా యుద్ధం కోసం 130 మంది బాల బాలికలను రిక్రూట్ చేసుకున్నారు. 9 నుంచి 11 ఏళ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి 17 ఏళ్లలోపు వారు 40 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి స్నైపర్ గన్స్, IED, ఫైటింగ్, అటాకింగ్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు.

News March 27, 2025

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

image

ఢిల్లీ ప్రభుత్వం మందుల సేకరణ విధానంపై సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రులు ఇకపై పీఎం జన ఔషధి కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపింది. మెడిసిన్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చేందుకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఢిల్లీ సర్కారు MoU కూడా కుదుర్చుకుంది.

News March 27, 2025

బంగ్లా ఫ్రీడమ్ డే.. యూనస్‌కు మోదీ లేఖ

image

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. 1971 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడిన రోజుగా అభివర్ణించారు. ఇకపైనా ‘సున్నితమైన’ అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా యూనస్‌తో పాటు బంగ్లా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

error: Content is protected !!