News August 9, 2024

నామినీల సంఖ్య పెంపునకు కేంద్రం ఓకే?

image

ఒక బ్యాంకు ఖాతాకు నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక బ్యాంకు అకౌంట్‌కు ఒకరే నామినీగా ఉండే అవకాశం ఉంది. బ్యాంకుల రిపోర్టింగ్ తేదీలను కూడా మారుస్తూ చట్ట సవరణ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శుక్రవారాల్లో రిపోర్టులు ఇస్తుండగా ప్రతినెలా 15, చివరి తేదీలకు మార్చినట్లు తెలుస్తోంది.

Similar News

News April 11, 2026

అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

News April 11, 2026

బౌలర్ ఎవరనేది పట్టించుకోను: వైభవ్

image

తాను బాల్‌ను బట్టి షాట్లు ఆడతానని, బౌలర్ ఎవరనేది పట్టించుకోనని RR బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపారు. RCBతో మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. బుమ్రా, హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం భయంగా ఉండదా అని అడగగా, మైండ్‌లో అది ఉంటుంది కానీ తాను బాల్‌ను మాత్రమే చూస్తానని చెప్పారు. బ్యాడ్ షాట్ ఆడి ఔటైతే బాధపడతానన్నారు.
* మ్యాచ్‌ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.