News December 30, 2024
కామన్ డైట్ ఆరంభ శూరత్వమేనా?: కేటీఆర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అట్టహాసంగా ప్రారంభించిన కామన్ డైట్ ఆరంభ శూరత్వమేనా? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా ఉంటే ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 16, 2025
చరిత్ర సృష్టించిన ప్రతిక
IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.
News January 16, 2025
సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN
AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.
News January 16, 2025
‘దబిడి దిబిడి’ స్టెప్పులపై విమర్శలు.. ఊర్వశి ఏమన్నారంటే?
‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాటలో డాన్స్ స్టెప్పులపై విమర్శలు రావడంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ‘లైఫ్‌లో ఏం సాధించలేని కొందరు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. వాళ్లు తమకు ఆ అర్హత ఉందనుకోవడం విడ్డూరం. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఆయనతో పని చేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆ డాన్స్ స్టెప్పులన్నీ కళలో భాగం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.