News July 25, 2024

నార్త్, సౌత్ బెంగాల్‌ విభజన తప్పదా? (2)

image

నార్త్ బెంగాల్ డిమాండ్ కొత్తదేం కాదు. బ్రిటిషర్లూ దీని విశిష్టతను గుర్తించే ప్రత్యేకంగా పరిపాలించారు. టీ తోటలు, సహజ వనరులు, కొండలు, విదేశాలతో సరిహద్దులుండటం దీని స్పెషాలిటీ. దేశ రక్షణకిది వ్యూహాత్మక ప్రాంతం. నిజానికి బెంగాల్ మొత్తం కోల్‌కతా కేంద్రంగా డెవలప్ చేశారు. పరిశ్రమలన్నీ దానిచుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, మౌలికం, పరిపాలన, ఉపాధి, పథకాలు ఇక్కడి ప్రజలకే మెరుగ్గా అందుతున్నాయి.

Similar News

News July 8, 2025

‘డిగ్రీ’ వద్దంటా..!

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

News July 8, 2025

తమిళ రీమేక్ చేయనున్న నాగార్జున?

image

నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News July 8, 2025

UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

image

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.