News May 11, 2024

టీమ్‌ఇండియాలో ద్రవిడ్ శకం ముగిసినట్లేనా?

image

భారత జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకోకపోవచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 2021 నవంబర్‌లో ఆయన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ODI WCతో కాంట్రాక్టు ముగియగా, T20 WC కోసం కాంట్రాక్టును BCCI జూన్ వరకు పొడిగించింది. మరోసారి కోచ్ పదవికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆయన ఆసక్తిగా లేరని సమాచారం. దీంతో టీమ్‌ఇండియాలో ద్రవిడ్ శకం ముగిసినట్లేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 28, 2025

కాశీకి వెళ్లలేకపోయినా.. ఈ శివాలయాలకు వెళ్లవచ్చు

image

మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్లి తీరాలని మన శాస్త్రాలు చెబుతాయి. అయితే కాశీ వెళ్లడం సాధ్యం కానప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాశీతో సమానమైన శక్తి ఉన్న 4 కాశీ క్షేత్రాలు ఉన్నాయంటున్నారు. వీటిలో ఏ క్షేత్రాన్ని దర్శించినా కాశీ యాత్ర ఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 1. కేదార క్షేత్రం 2. శ్రీశైలం 3. శ్రీకాళహస్తి 4. పట్టిసము (పట్టిసీమ).

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.

News November 28, 2025

కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

image

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.