News May 11, 2024

టీమ్‌ఇండియాలో ద్రవిడ్ శకం ముగిసినట్లేనా?

image

భారత జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకోకపోవచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 2021 నవంబర్‌లో ఆయన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ODI WCతో కాంట్రాక్టు ముగియగా, T20 WC కోసం కాంట్రాక్టును BCCI జూన్ వరకు పొడిగించింది. మరోసారి కోచ్ పదవికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆయన ఆసక్తిగా లేరని సమాచారం. దీంతో టీమ్‌ఇండియాలో ద్రవిడ్ శకం ముగిసినట్లేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News February 11, 2026

తుది పోలింగ్.. 73.60 శాతం నమోదు: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా కొనసాగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. తుది పోలింగ్ 73.60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పురుష ఓటర్లలో 73.70 శాతం, మహిళా ఓటర్లలో 73.51 శాతం, ఇతరులు 78.95% నమోదైందన్నారు.

News February 11, 2026

T20 WC: తడబడి నిలబడిన విండీస్

image

ఇంగ్లండ్‌తో మ్యాచులో వెస్టిండీస్ 196/6 రన్స్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 8 పరుగులకు 2.. 77 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో WI తక్కువ స్కోర్‌కే చాప చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ రూథర్‌ఫోర్డ్ 76, ఛేజ్ 34, హోల్డర్ 33 రన్స్‌తో రాణించడంతో 200 మార్క్‌కు చేరువైంది. ENG బౌలర్లలో రషీద్, ఓవర్టన్ చెరో 2 వికెట్లు తీశారు.

News February 11, 2026

ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

image

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.