News August 16, 2024
జాతీయ జెండా చిరిగిపోయిందా? ఏం చేస్తున్నారు?
దేశవ్యాప్తంగా నిన్న జెండా వందనం జరిగింది. జెండాలతో ముస్తాబైన వీధులు ఇప్పుడు బోసిపోయాయి. అయితే తొలగించిన ఆ జెండాలను ధ్వంసం చేయవద్దనే కఠిన నిబంధనలున్నాయి. కానీ గాలికి చిరిగినా, మురికిగా మారిన వాటిని మాత్రం ఫ్లాగ్ కోడ్ 2022 ప్రకారం దాన్ని గౌరవమైన పద్ధతిలో విసర్జనం చేయవచ్చు. అంటే ఖననం లేదా నదిలో వదిలేయడం, కాల్చేయడం. అయితే అది పబ్లిక్‌గా చేసేందుకు వీల్లేదు. వీడియోలు, ఫొటోలు అసలే తీయకూడదు.
Similar News
News September 11, 2024
వారికి రూ.25,000 సాయం!
AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
News September 11, 2024
నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం TGలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.
News September 11, 2024
రాష్ట్రానికి మరో 2 మెడికల్ కళాశాలలు
AP: రాష్ట్రంలో కొత్తగా రెండు మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కడప, పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. కాగా గతేడాది జూన్‌లో 5 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి.