News May 12, 2024

ప్రధాని రేసులో ఉన్నారా.. కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే

image

లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని రేసులో ఉన్నారా అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. తాను లేనని బదులిచ్చారు. కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఆప్ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

Similar News

News March 11, 2026

భారత్‌కు తొలి టెస్ట్ విజయం అందించింది ఈయనే

image

భారత్‌కు తొలి టెస్ట్ విజయాన్ని(1952లో ENGపై) అందించిన కెప్టెన్ విజయ్ హజారే జన్మదినం నేడు. 1915లో సాంగ్లీ(MH)లో జన్మించారు. IND తరఫున 30 టెస్టుల్లో 2192 రన్స్, 20W తీశారు. 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు. FCలో 238 మ్యాచుల్లో 18,740R, 595W సాధించారు. FCలో 2 ట్రిపుల్ సెంచరీలు, ఒకే టెస్టులో 2 సెంచరీలు చేసిన తొలి IND ప్లేయర్ ఆయనే. కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పేరిట టోర్నీ నిర్వహిస్తోంది.

News March 11, 2026

విద్యార్థినులకు ఫ్రీగా స్కూటీలు.. దశల వారీగా అమలు?

image

TG: ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇస్తామని CM రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. స్కూటీల ధరలతో పాటు పంపిణీకి ఎంత సమయం పట్టొచ్చనే అంశాలను పరిశీలిస్తోంది. దాదాపు 1.70లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని, స్కూటీల కొనుగోలుకు ₹1600Cr ఖర్చవుతుందని అంచనా. రానున్న వార్షిక బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిస్తారని సమాచారం.

News March 11, 2026

LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఎలా తయారు చేస్తారు?

image

LPG ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. దీనిని 2 విధాలుగా (నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్) తయారు చేస్తారు. ముందుగా సహజ వాయువు/ముడి చమురు నుంచి ప్రొపేన్, బ్యూటేన్‌ను వేరు చేస్తారు. వీటిలోని నీరు, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 తొలగిస్తారు. తర్వాత ద్రవ రూపంలోకి మార్చి లీకేజీని గుర్తించేలా వాసన గల రసాయనాన్ని(ఈథైల్ మెర్కాప్టన్) కలుపుతారు. తర్వాత బాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లలో నింపుతారు.