News January 9, 2025

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?

image

TG: అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 18, 2025

జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

image

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

image

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.