News March 14, 2025

గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News March 28, 2026

యుద్ధం ఇంకొన్ని వారాలే: అమెరికా

image

పశ్చిమాసియా యుద్ధం కొన్నివారాల్లోనే ముగియనుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ అనుకున్న సమయం కంటే వేగంగానే టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయని, ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలోకి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక చర్యలతోనే శత్రువును దెబ్బకొడతామని వెల్లడించారు.

News March 28, 2026

కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు ముప్పు

image

చాలామంది బ్లడ్ టెస్టుల్లో కేవలం HDL, LDL మాత్రమే చూసుకుంటారు. అయితే కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు రావడానికి లిపోప్రోటీన్(a) లేదా Lp(a) ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి ఆహారం, వ్యాయామంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే శరీరంలో స్థిరంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డకట్టే రిస్క్‌ను పెంచుతుంది. భారతీయులలో ఈ ముప్పు మరీ ఎక్కువ.

News March 28, 2026

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ అరెస్ట్

image

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కింద అరెస్ట్ అయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వుడ్స్ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆయన డ్రింక్ చేయలేదని బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలినప్పటికీ మూత్ర పరీక్ష చేయడానికి నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైనా డ్రగ్స్ వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.