News February 18, 2025

బూతులు మాట్లాడేందుకు లైసెన్స్ ఉందా: సుప్రీంకోర్టు ఆగ్రహం

image

పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్ కామెంట్లు చేసిన <<15458454>>రణ్‌వీర్<<>> అలహాబాదియపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. ‘అతడు తల్లిదండ్రులను అవమానిస్తున్నాడు. అతడి బుర్రలోనే ఏదో బురద ఉంది. ఇలాంటి వ్యక్తికి మేమెందుకు ఫేవర్ చేయాలి? అతడి ప్రోగ్రాముల్లో అంతా అసభ్యతే కనిపిస్తోంది. ఇలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడేందుకు మీకేమైనా లైసెన్స్ ఉందా? పాపులారిటీ రాగానే ఏదైనా మాట్లాడొచ్చని భావిస్తున్నారు’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

Similar News

News March 28, 2025

IPL: ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయ్!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 18 ఏళ్లు పూర్తవుతోంది. అయితే, ఈ టోర్నీలో కొన్ని టీమ్స్ మెరుపులా వచ్చి అభిమానుల ప్రేమను సొంతం చేసుకొని పలు కారణాలతో రద్దయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్, పుణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు కొన్ని సీజన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో ఏ టీమ్‌కు మీరు సపోర్ట్ చేసేవారు? COMMENT

News March 28, 2025

భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

image

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

News March 28, 2025

నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.

error: Content is protected !!