News August 1, 2024
అన్ని బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిందేనా?
SBI మినహా దాదాపు అన్ని సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లలో అవసరం లేదు. సగటుగా గ్రామాల్లో ₹500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹వెయ్యి, అర్బన్/మెట్రో నగరాల్లో ₹2000 మెయింటైన్ చేయాలి. లేకపోతే ప్రాంతాన్నిబట్టి ఛార్జీలుంటాయి. ₹100, ₹150, ₹250 పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. కరెంట్ అకౌంట్ విషయంలో ఛార్జీలు వేరుగా ఉంటాయి.
Similar News
News October 7, 2024
ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.
News October 7, 2024
దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!
పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.