News May 21, 2024
రాష్ట్రంలోని అన్ని సీట్లనూ క్లీన్‌స్వీప్ చేసిన పార్టీ ఉందా?
AP CM జగన్ వైనాట్ 175 అంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే అలా ఒక రాష్ట్రంలోని అన్ని సీట్లను ఒకే పార్టీ గెలిచిన సందర్భం ఉందా? అంటే అవుననే చెప్పాలి. సిక్కింలో 2సార్లు ఇలా జరిగింది. 1989లో NB భండారీ నేతృత్వంలోని సిక్కిం సంగ్రామ్ పరిషద్ 32 సీట్లనూ గెలుచుకుంది. అలాగే 2009లోనూ పవన్ చామ్లింగ్ సారథ్యంలోని సిక్కిం డెమొక్రటిక్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇలాంటి సందర్భాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
Similar News
News January 11, 2025
రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..
ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.
News January 11, 2025
NEET రద్దు: పాలకులపై మండిపడ్డ యాక్టర్ విజయ్
ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ DMKపై TVK అధినేత, యాక్టర్ విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.
News January 11, 2025
ముంబైలో ఒంటరిగానే పోటీ: సంజయ్ రౌత్
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (UBT) ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.