News February 1, 2025

ట్యాక్స్ ఊరట ఉండబోతోందా..?

image

ఈ బడ్జెట్‌లో కేంద్రం 6 అంశాల్లో సంస్కరణలు చేయబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్సేషన్, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్ & నియంత్రణ సంస్కరణలు చేస్తామన్నారు. దీంతో అంతా ఆశిస్తున్నట్లుగా ఆదాయపన్నులో ఊరట లభించబోతుందని సంకేతాలు వెలువడ్డాయి.

Similar News

News January 9, 2026

గోల్డెన్ గ్లోబ్స్ 2026.. ప్రజెంటర్‌గా ప్రియాంకా చోప్రా

image

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 11న జరగబోయే 83వ Golden Globes 2026లో ఆమె ప్రజెంటర్‌గా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా అవార్డులు అందజేయనున్నారు. కామెడీ స్టార్ నిక్కీ గ్లేజర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది సినిమాలతో పాటు పాడ్‌కాస్ట్ విభాగాల్లోనూ అవార్డులు ఇవ్వనుండటం విశేషం.

News January 9, 2026

నా మాటలే సున్నితం.. చేతలు గట్టిగా ఉంటాయి: పవన్

image

AP: ప్రజలను అభద్రతాభావానికి గురిచేసేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. తన మాటలు సున్నితంగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు. ‘అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శను స్వాగతిస్తా. కానీ కులాలు, మతాల మధ్య గొడవ పెట్టాలని చూస్తే నేను వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తా. సీఎం, నాతో సహా ఎవరూ వ్యవస్థకు అతీతం కాదు. నాకు ముందుకెళ్లే ఆలోచన తప్ప ఓటమి భయం లేదు’ అని చెప్పారు.

News January 9, 2026

గత పాలకులు ఏమీ చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు: పవన్

image

AP: పనిచేసే నాయకులకు అండగా నిలవాలని Dy.CM పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు ఏమీ చేయకుండా తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలికని, నిర్మించడమే కష్టమని పేర్కొన్నారు.