News February 1, 2025
ట్యాక్స్ ఊరట ఉండబోతోందా..?

ఈ బడ్జెట్‌లో కేంద్రం 6 అంశాల్లో సంస్కరణలు చేయబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్సేషన్, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్ & నియంత్రణ సంస్కరణలు చేస్తామన్నారు. దీంతో అంతా ఆశిస్తున్నట్లుగా ఆదాయపన్నులో ఊరట లభించబోతుందని సంకేతాలు వెలువడ్డాయి.
Similar News
News February 16, 2025
ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.
News February 16, 2025
ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.
News February 16, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.