News January 10, 2025

తెలంగాణకు సం‘క్రాంతి’లేదా?

image

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు మెుండిచెయ్యి చూపింది. APకి వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు కేటాయించిన అధికారులు.. తెలంగాణకు మాత్రం ఒక్క రైలూ ప్రకటించలేదు. దీంతో బస్సుల్లో వెళ్లాలంటే రూ.వేలు వెచ్చించాల్సి వస్తుందని వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పండుగకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

Similar News

News January 10, 2025

నా వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవి కాదు: BR నాయుడు

image

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్‌కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడా. నా వ్యాఖ్యలను పవన్‌కు ఆపాదించడం భావ్యం కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే భక్తులు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

News January 10, 2025

పాత పద్ధతిలో స్కూళ్లు.. పలు మార్పులు

image

AP పాఠశాలల స్ట్రక్చర్‌ను మారుస్తూ గత ప్రభుత్వం జారీచేసిన GO 117ను ఉపసంహరించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. అంతకు ముందున్న విధానాన్నే స్వల్ప మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (pp1 pp2), ఫౌండేషనల్ స్కూల్ (pp1, pp2, 1, 2) బేసిక్ ప్రైమరీ(1-5), మోడల్ ప్రైమరీ(pp1, pp2, 1-5), హైస్కూల్ (6-10) విధానంలో స్కూళ్లు ఉంటాయి. విధివిధానాలపై విద్యాశాఖ మెమో జారీచేసింది.

News January 10, 2025

ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం

image

బాసిల్ జోసెఫ్, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ రేపు ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలై దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించింది. ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 8.1 రేటింగ్ ఉంది.