News August 22, 2025

మీ ఫోన్‌లో ఇలా అవుతోందా?

image

పలు ఫోన్లలో కాలింగ్ ఇంటర్‌ఫేజ్ మారింది. కాల్ చేస్తే పెద్ద అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. కాల్ రిసీవింగ్, కట్ చేసేందుకు పైకి, కిందకి కాకుండా సైడ్‌కు స్లైడ్ చేయాల్సి వస్తోంది. ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్, నాన్-స్పామ్, స్పామ్ అని చూపిస్తోంది. రియల్‌మీ, వన్ ప్లస్, మోటో, ఒప్పో, వివో, ఐక్యూ మోడళ్లలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు తమకు మార్పులు కనిపించట్లేదని అంటున్నారు.

Similar News

News August 22, 2025

ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్టు?

image

AP: మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలోనే నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పన సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

News August 22, 2025

SM ఇన్‌ఫ్లూయెన్సర్లపై చర్యలకు BRS సన్నద్ధం

image

TG: KCR, KTRకు పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని BRS హెచ్చరించింది. ‘KCR, KTRను టార్గెట్ చేస్తూ SMలో కొందరు పోస్టులు పెడుతున్నారు. వారికి కాంగ్రెస్ డబ్బులు ఇస్తోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. గొర్రెల స్కామ్‌పై SMలో పలు వీడియోలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News August 22, 2025

ఆ కుక్కలను వదలకండి: సుప్రీంకోర్టు

image

ఢిల్లీలో వీధికుక్కలపై ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. షెల్టర్లకు తరలించిన కుక్కలకు స్టెరిలైజ్, ఇమ్యునైజేషన్ తర్వాత బయట ప్రదేశాల్లో వదిలేయాలని సూచించింది. రేబిస్ సోకిన, దూకుడుగా ఉండే కుక్కలను వదలవద్దని ఆదేశించింది. వీధికుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.