News September 10, 2024

ఛాంపియన్స్‌కు మనమిచ్చే స్వాగతమిదేనా?

image

పారాలింపిక్స్‌లో సత్తాచాటి మెడల్స్‌తో తిరిగొచ్చిన తమకు ఘనస్వాగతం లభిస్తుందని అథ్లెట్లు భావించారు. టీ20 వరల్డ్ కప్ విజేతలకు లభించిన స్వాగతం తర్వాత ఏ క్రీడాకారుడైనా ఇలానే ఆలోచిస్తారు. అంతే ఉత్సాహంతో ఫ్లైట్ దిగి బయటకొచ్చి చూస్తే కుటుంబీకులు, సన్నిహితులు, పదుల సంఖ్యలో క్రీడాభిమానులు మినహా ఎవరూ కనిపించలేదు. ఈసారి 7 స్వర్ణాలతో సహా 29 పతకాలు గెలిచినా ఇలా చేయడంపై క్రీడా ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News July 10, 2025

నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు: విద్యా బాలన్

image

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో నటించాల్సిన ‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని నటి విద్యా బాలన్ తెలిపారు. కానీ హీరో, డైరెక్టర్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్లే ఆ మూవీ ఆగిపోయిందన్నారు. ‘ఆ ఒక్క సినిమా ఆగిపోవడం వల్ల నేను 8-9 ప్రాజెక్టులు కోల్పోయా. రాత్రికి రాత్రే అంతా కోల్పోయా. కొన్ని సినిమాల్లో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా నన్ను తొలగించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News July 10, 2025

కేజ్రీవాల్‌కు నోబెల్.. బీజేపీ VS ఆప్ వార్

image

పరిపాలనలో తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అవినీతి, అసమర్థతకు కేజ్రీవాల్ మారుపేరని బీజేపీ విమర్శించింది. అవినీతి కేటగిరీలో ఆయన నోబెల్‌కు అర్హుడంటూ ఎద్దేవా చేసింది. మరోవైపు వ్యక్తి నామస్మరణ మాని పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని BJPకి ఆప్ కౌంటరిచ్చింది.

News July 10, 2025

పిల్లలు ఫోన్ చూస్తున్నారా?

image

దేశంలో 5 ఏళ్ల లోపు చిన్నారులు మొబైల్, TV చూసే విషయంలో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. WHO ప్రతిపాదనలను మించి రోజుకు 2.2 గంటలు స్క్రీన్ చూస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల స్కిల్స్ తగ్గుతాయని, ఊబకాయం పెరుగుతుందని, నిద్ర అలవాట్లు మారి ఆరోగ్యంపై పాడవుతుందని ఆ సర్వే హెచ్చరించింది. కాగా 2 ఏళ్లలోపు పిల్లలు అసలు స్క్రీన్ చూడొద్దని, 2-5 ఏళ్ల వారు రోజుకు గంట మాత్రమే చూడొచ్చని WHO చెబుతోంది.