News January 5, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ స్క్వాడ్ ఇదేనా?

image

ఈ నెల 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఈ టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఖాయమని టాక్. ప్రాబబుల్ జట్టు: రోహిత్ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, కుల్దీప్/రవి బిష్ణోయ్.

Similar News

News January 16, 2025

600 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 ప్రొబెషనరీ ఆఫీసర్స్(PO) దరఖాస్తుల గడువు ఈనెల 19కి పొడిగించింది. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.750 కాగా SC, ST, PwD క్యాండిడేట్లకు ఉచితం. డిగ్రీ పూర్తి చేసి, 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

News January 16, 2025

ఇన్ఫోసిస్: Q3లో రూ.6.806 కోట్ల లాభం.. 5,591 మంది నియామకం

image

డిసెంబర్ త్రైమాసికంలో రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2023 DECతో(రూ.6,106 కోట్లు) పోలిస్తే 11.46 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరినట్లు పేర్కొంది. Q3లో కొత్తగా 5,591 మందిని రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు వివరించింది.

News January 16, 2025

పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష

image

NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.