News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?

భారత టెస్ట్ టీమ్‌లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్‌కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్‌పైనే ఉందని తెలిపారు.
Similar News
News January 29, 2026
‘వారణాసి’ మూవీ రిలీజ్ తేదీ ఇదేనా?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వారణాసి పట్టణంలో ‘ఏప్రిల్ 7 2027న థియేటర్లలో విడుదల’ అనే హోర్డింగ్స్ ఏర్పాటు చేయగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఆరోజునే ఉగాది ఉండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
News January 29, 2026
నాపై తప్పుడు ప్రచారం చేశారు: శశి థరూర్

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న MP శశి థరూర్ ఎట్టకేలకు INC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో వారిద్దరిని కలిశారు. సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అనంతరం థరూర్ మీడియాకు చెప్పారు. ‘అంతా బాగానే ఉంది. మేమంతా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఎప్పుడూ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పదవులు అడగలేదు. నాపై తప్పుడు ప్రచారం చేశారు’ అని అన్నారు.
News January 29, 2026
మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.


