News November 4, 2024
భారత జట్టులో సీనియర్లకు ఇదే చివరి సిరీస్?
భారత టెస్ట్ టీమ్‌లో సీనియర్లైన రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్‌కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తన భవితవ్యంపై రోహిత్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని, ప్రస్తుతం తన దృష్టి AUS సిరీస్‌పైనే ఉందని తెలిపారు.
Similar News
News December 5, 2024
పెళ్లి తర్వాత శోభిత తొలి పోస్ట్
అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత హీరోయిన్ శోభిత తొలి పోస్ట్ చేశారు. చైతూతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘పెళ్లి ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నిన్న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
News December 5, 2024
ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ సరఫరాపై ఆందోళనలు
మెడిసిన్స్‌ను 10 Minలో వినియోగదారులకు డెలివరీ చేస్తున్న సంస్థల తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మందుల సరఫరాలో ఉన్న నిర్దిష్ట ప్రోటోకాల్‌కు ఇది విరుద్ధమని చెబుతున్నారు. ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్, పేషెంట్ ఐడెంటిఫికేషన్ లేకుండానే మెడిసిన్స్ డెలివరీ హానికరమని హెచ్చరిస్తున్నారు. కాలంచెల్లిన, నకిలీ మందుల సరఫరాకు ఆస్కారం ఉండడంతో దీన్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
News December 5, 2024
మీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. రష్మిక రియాక్షన్ ఇదే
‘పుష్ప-2’లో హీరోయిన్ రష్మిక అదరగొట్టారని సినిమా చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్ తర్వాత ఆమె నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనికి ‘నిజమా? యాయ్!’ అంటూ నేషనల్ క్రష్ రిప్లై ఇచ్చారు. కాగా ఈ మూవీలో రష్మిక డాన్స్ కూడా ఇరగదీశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.