News November 20, 2024
మహిళల్లో ఈ సమస్యలు.. కారణం అదేనా?
చాలామంది మహిళలు రుతుక్రమం సరిగ్గాలేక ఇబ్బందులు పడుతుంటారు. అధికంగా జింక్ తీసుకోవడమే దీనిక్కారణం కావొచ్చని పుణే వైద్యురాలు సునీత తాండూల్‌వాడ్కర్ పేర్కొన్నారు. ‘ఆరోగ్యానికి జింక్ అవసరమే. కానీ దాని స్థాయులు ఎక్కువైనప్పుడు ఒంట్లోకి ఇతర మినరల్స్‌ని రానివ్వదు. అండం విడుదలను, రుతుక్రమాన్ని అస్థిరపరుస్తుంది. రోజుకు 14 మిల్లీగ్రాములకు మించి జింక్ శరీరానికి అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 13, 2024
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర
AP: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దీనిని రూపొందించామని చెప్పారు. ‘తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండాలి. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి. గత ప్రభుత్వంలో ఊహించని విధ్వంసం జరిగింది. ఇప్పుడు దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని కేటీఆర్ అన్నారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌నూ అరెస్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.
News December 13, 2024
హైకోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్
అల్లు అర్జున్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈనెల 11నే పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకు కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే అత్యవసర పిటిషన్లు ఉ.10.30 గంటలకే జత చేయాలని, ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని పేర్కొంది. అయితే అప్పటివరకు అర్జున్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన లాయర్ కోరారు.