News September 24, 2024
‘కల్కి2898ఏడీ’ సీక్వెల్ టైటిల్ ఇదేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి2898ఏడీ’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీని సీక్వెల్‌పై నెట్టింట పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సీక్వెల్‌కు ‘కర్ణ3102బీసీ’ అని టైటిల్ నిర్ణయించారని.. కర్ణుడు, అశ్వత్థామ, యాస్కిన్‌ల చుట్టూ కథ తిరుగుతుందని ఆ వార్తల సారాంశం. మహాభారతం సమయంలో జరిగే సీన్లు ఎక్కువగా ఉంటాయని చర్చ నడుస్తోంది. 2028లో మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో చూడాలి.
Similar News
News October 15, 2024
రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.
News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?
దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.
News October 15, 2024
కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు
కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.