News April 22, 2024
విరాట్ కోహ్లీది ఔటా? నాటౌటా?

కేకేఆర్‌తో మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారుతోంది. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్ టాస్ బంతిని విరాట్ డిఫెన్స్ ఆడటంతో బంతి గాల్లోకి లేచి రిటర్న్ క్యాచ్ అందుకున్నారు. బాల్ నడుము కంటే పైకి వచ్చిందని కోహ్లీ రివ్యూ తీసుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఇది కొందరు ఔట్ అని.. మరికొందరు నాటౌట్ అని వాదిస్తున్నారు. మరి ఇది ఔటా.. నాటౌటా కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.
News March 11, 2026
GAILలో 70 పోస్టులు.. మార్చి 18 చివరి తేదీ

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com
News March 11, 2026
జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


