News January 21, 2025

లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!

image

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

Similar News

News February 19, 2025

Congratulations: దీప్తి జీవాంజికి గోల్డ్ మెడల్

image

23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప్తి జీవాంజి మెరిశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగును 57.82 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఆమెకు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన దీప్తి ఇటీవల అర్జున అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీప్తి జీవాంజిది TGలోని వరంగల్ జిల్లా పర్వతగిరి (M) కల్లెడ.

News February 19, 2025

21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్.. చివరకు!

image

TG: కరీంనగర్‌కు చెందిన 26ఏళ్ల యువకుడు 5ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి మలం ద్వారా క్యాప్ వెళ్లి ఉంటుందని, ఏ ఇబ్బంది లేదన్నారు. ఇటీవల 10రోజులుగా అతను అనారోగ్యంతో HYDలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. CT స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉండటం గుర్తించి వెలికితీశారు. 21 ఏళ్లుగా క్యాప్ ఉండటం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.

News February 19, 2025

LRS.. మార్చి 31 వరకు గడువు

image

TG: లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్నవారికి, 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకూ అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

error: Content is protected !!