News March 17, 2024
అభిమానులకు ఇషాన్ కిషన్ విజ్ఞప్తి

తమను చూసేందుకు మైదానానికి, నెట్స్ వద్దకు వచ్చే అభిమానులకు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు వస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయొద్దు. దయచేసి గ్రౌండ్ను క్లీన్గా ఉంచండి. చిన్న చిన్న విషయాలే. కానీ అన్నీ కలిపితే మొత్తంగా మెరుగవుతాం. అన్నీ మనం చేయగలిగినవే’ అని తెలిపారు. ఈ నెల 24న గుజరాత్తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.
Similar News
News October 24, 2025
అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్లో కేజీ టమాటా రూ.600

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.
News October 24, 2025
వంటింటి చిట్కాలు

* పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే అవి బాగా పొంగుతాయి.
* వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి.. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడి చేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు, కూర రుచిగా ఉంటుంది.
* చేతులకు కొబ్బరినూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే, చేతులు మండవు.
News October 24, 2025
స్వాతి కార్తె అంటే ఏంటి?

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.


