News March 17, 2024

అభిమానులకు ఇషాన్ కిషన్ విజ్ఞప్తి

image

తమను చూసేందుకు మైదానానికి, నెట్స్ వద్దకు వచ్చే అభిమానులకు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు వస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయొద్దు. దయచేసి గ్రౌండ్‌ను క్లీన్‌గా ఉంచండి. చిన్న చిన్న విషయాలే. కానీ అన్నీ కలిపితే మొత్తంగా మెరుగవుతాం. అన్నీ మనం చేయగలిగినవే’ అని తెలిపారు. ఈ నెల 24న గుజరాత్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.

Similar News

News February 11, 2026

అయ్యప్ప దీక్షతో ఆరోగ్య రహస్యాలు

image

అయ్యప్ప దీక్ష ఆత్మస్థైర్యానికి శిక్షణ. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్షవరం చేయకపోవడం దేహంపై మోహాన్ని తగ్గించి, చలి నుంచి రక్షణనిస్తుంది. వేడిని గ్రహించే నలుపు వస్త్రాలు వైరాగ్యానికి ప్రతీకలు. పాదరక్షలు విడిస్తే కష్టాలు తట్టుకునే కఠినత్వం అలవడుతుంది. ఇలా ప్రతి నియమం భక్తుడిని శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది.

News February 11, 2026

అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ‘వార్’ తప్పదా?

image

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్న నేపథ్యంలో YCP చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తిగా హాజరవడం అనుమానమే. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, YCP నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.

News February 11, 2026

మున్సి‘పోల్’కు వేళాయే!

image

TG: మున్సిపోల్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉ.7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటర్/ఆధార్/పాన్/డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.